31-08-2024 NORMAL NEWS 05:02 AM
swarnodayam.com
Telugu Daily News
31-08-2024 05:02 AM By Mandala Yadagiri

ప్రవేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో సిబి సిఐడి అధికారులచే విచారణ జరిపించాలి.

ప్రవేట్ విద్యా సంస్థలలో విద్యార్థుల ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో సిబి సిఐడి అధికారులచే విచారణ జరిపించాలి.
IMG-20240831-WA0083

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థలలో జరుగుతున్న ఆత్మహత్యలపై పూర్తిస్థాయిలో ఉన్నత శాఖ అధికారులచే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని తెలంగాణ విద్యార్థి యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కర్రె శ్రీధర్ రెడ్డి శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అధిక ఫీజుల కోసం వేధించడం వల్ల పలు ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఉన్నత విద్యాశాఖ అధికారులచే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, ఏ ఒక్క ప్రైవేట్ విద్యాసంస్థల కనీసం మౌలిక వసతులు లేవని అతను అన్నారు. ఏ యొక్క విద్యాశాఖ అధికారి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలను తనిఖీ చేసిన పాపాన పోవడం లేదని అతను మండి పడ్డారు. ఎక్కడైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అనుమానస్పదిగా మృతి చెందారని తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసి యజమాన్యంపై ఏలాంటి కేసులు కాకుండా నయానో బయనో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!