01-09-2024 NORMAL NEWS 08:14 AM
swarnodayam.com
Telugu Daily News
01-09-2024 08:14 AM By Mandala Yadagiri

ప్రభుత్వాలు తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. __పిఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాచర్ల శ్రీనివాస్, పసుల శంకర్ నేత.

ప్రభుత్వాలు తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. __పిఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాచర్ల శ్రీనివాస్, పసుల శంకర్ నేత.
IMG-20240901-WA0138

స్వర్ణోదయం ప్రతినిధి, భూపాలపల్లి, సెప్టెంబర్ 01:-భూపాలపల్లి జిల్లా కేంద్రంలో,తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్స్ కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా పిఆర్ టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్త పెన్షన్ విధానమనేది ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆయన అన్నారు. ఒక 30 సంవత్సరాల పైబడి ఉద్యోగం చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ కొత్త పెన్షన్ విధానం ద్వారా ఆత్మన్యూనతా భావనలో మగ్గుతున్నారని అని అన్నారు. ఒకవేళ వారు మరణించినట్లయితే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశం ఉందని, ఈ ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా జీవించే హక్కును కాల రాస్తున్నాయని వెంటనే సిపిఎస్, యుపిఎస్ విధానాలను రద్దుపరిచి తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని(ఓ పి,యస్ )తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఒకసారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైనట్లయితే ఎన్నిసార్లు ఎన్నికైతే అన్ని సార్లు అన్ని పెన్షన్స్ జీవితకాలం వస్తాయని కానీ ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఉద్యోగం సంపాదించి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా సేవలందించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు తీరని ఆవేదన మిగులుతున్నదని ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే ప్రభుత్వాలు ఆలోచన చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు. లేదంటే రానున్న రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం కానున్నదని తెలియజేశారు. అలాగే కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్ నేత మాట్లాడుతూ… నేడు ఏర్పడిన ప్రభుత్వము ఎలక్షన్లకు ముందు వారి మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయని యెడల ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని నిలదీయడానికైన వెనుకాడబోమని తెలియజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు కురసం అశోక్ కుమార్, అనిల్, జిల్లా బాధ్యులు ఎల్కటి శరత్, స్వర్గం సతీష్, చింతల వెంకటేష్ తదితర ఉద్యోగ ఉపాధ్యాయులు పిఆర్ టియు తెలంగాణ పక్షాన పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!