Social 1080×1350 • Multi-page
01-09-2024 BREAKING NEWS 08:36 AM
swarnodayam.com
Telugu Daily News

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ జారీ!

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్ జారీ!
IMG-20240901-WA0142

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలతో ద్విచక్ర వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలకు అత్యవసరమైతే 040 21111111, 9000113667 నెంబర్‌ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!