Social 1080×1350 • Multi-page
01-09-2024 BREAKING NEWS 09:45 AM
swarnodayam.com
Telugu Daily News

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం.. జలమయం అయిన రహదారులు లోతట్టు ప్రాంతాలు.! హుజురాబాద్ లో 13 సెంటీమీటర్ల వర్షపాతం.

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం.. జలమయం అయిన రహదారులు లోతట్టు ప్రాంతాలు.! హుజురాబాద్ లో 13 సెంటీమీటర్ల వర్షపాతం.
IMG_20240901_204119

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అల్పపీడన ప్రభావం వల్ల శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజామున వరకు హుజురాబాద్ పట్టణంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. రాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. రాత్రి నుండి కురిసిన భారీ వర్షంతో వినాయక విగ్రహాలు, పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు వీధుల్లో ఇల్లల్లోకి నీరు వచ్చి చేరింది. పట్టణంలోని మామిళ్ళవాడ, బుడగ జంగాల కాలనీ, కిందివాడ, పకీరువాడ, రజకవాడలలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుడగ జంగాల కాలనీలోని పలు వీధులన్నీ నీటిమయం కావడం పలువురు ఇళ్లలోకి నీరు చేరడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మామిళ్లవాడలో ఒక ఇంటికి స్వల్పంగా నష్టం కలగడంతో ఎమ్మార్వో కనకయ్య ఆదేశంతో అధికారులు ఆ ఇంటి యజమానిని ఇతర ప్రాంతానికి తరలించారు. భారీ వర్షం వల్ల హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, జూనియర్ కళాశాల విధానం, బాలికల ఉన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండిపోయింది. చిలుక వాగు భారీగా పారుతుండడంతో హుజురాబాద్ కు కనుకులగిద్దకు ప్రయాణ సౌకర్యాలు దెబ్బతిన్నాయి. పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ పారిశుధ్య ప్రత్యేక సిబ్బంది వర్షా బావ ప్రాంతాలలో టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలసి తమ సేవను అందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!