01-09-2024 NORMAL NEWS 10:26 PM
swarnodayam.com
Telugu Daily News
01-09-2024 10:26 PM By Mandala Yadagiri

27 రోజుల అనంతరం మాల (నక్షత్ర దీక్ష) విరమణ చేసిన మంత్రి పొన్నం

27 రోజుల అనంతరం మాల (నక్షత్ర దీక్ష) విరమణ చేసిన మంత్రి పొన్నం
IMG_20240902_090959

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం భద్రకాలీ సమేత శ్రీ కొత్తకొండా వీరభద్ర స్వామి వారి 27 రోజుల నక్షత్ర దీక్ష చేపట్టిన బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి అన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం కొత్తకొండ దేవాలయంలో మాల విరమణ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, కోడెముక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా కోరుకున్నట్లు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!