Telugu Daily News
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వోడితలప్రణవ్..వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకుంటాం.

–వరద నివారణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటాం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన 15, 17 వార్డులోని మామిండ్లవాడను, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించి, స్థానికులతో మాట్లాడారు. రాబోయే కాలంలో వరద నివారణకు అవసరమయ్యే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్, అధికారులతో మాట్లాడి వరద నివారణకు అవసరమయ్యే చర్యలు చేపట్టాలని కోరారు. వరద ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.




