03-09-2024 NORMAL NEWS 12:20 PM
swarnodayam.com
Telugu Daily News
03-09-2024 12:20 PM By Mandala Yadagiri

జమ్మికుంటలో 700 గ్రాముల గంజాయి పట్టివేత

జమ్మికుంటలో 700 గ్రాముల గంజాయి పట్టివేత
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట పట్టణంలో మంగళవారం పట్టణ ఎస్ఐ టి వివేక్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గణేష్ నగర్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను ఎస్సై ఆపి వివరాలను అడగగా పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 700 గ్రాముల గంజాయి లభించినట్లు ఎస్ఐ వివేక్ తెలిపారు. వారిని ఎక్కడి నుండి ఈ గంజాయిని తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నించగా మండలంలోని బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన ఎండి అక్రమ్ అనే వ్యక్తి వీరికి అమ్మినట్లు ఆ యువకులు భావండ్లపల్లి అఖిల్, పస్తం కుమార్, చాందల్య కిషోర్, వెలిషోజుల విష్ణువర్ధన్ లని పోలీసులకు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వరగంటి రవి విలేకరులతో మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ నిషేధిత గంజాయి, గుడుంబా లాంటి మాదక ద్రవ్యాలను అమ్మిన లేదా వాటిని ఉపయోగించిన చట్టపరంగా శిక్షించబడతారని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిఐ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!