04-09-2024 NORMAL NEWS 05:18 AM
swarnodayam.com
Telugu Daily News
04-09-2024 05:18 AM By Mandala Yadagiri

ఆపదలో ఉన్నవారికి అభయ హస్తం కాంగ్రెస్ ప్రభుత్వం..సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా కుటుంబాలకు భరోసా..సిఎంఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్

ఆపదలో ఉన్నవారికి అభయ హస్తం కాంగ్రెస్ ప్రభుత్వం..సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా కుటుంబాలకు భరోసా..సిఎంఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
IMG-20240904-WA1174

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరు ఆపదలో ఉన్న, ఎలాంటి కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటానని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నదని, హుజురాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహాకారం ఉందని, ఎవరు ఆధైర్య పడవల్సిన అవసరం లేదని బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యం చెందిన వారికి వారి కుటుంబాలకు భరోసాగా సిఎంఆర్,ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్ నియోజకవర్గంలో వివిధ కారణాల వల్ల అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అర్హులైన నిరుపేదలందరికి సహాయం అందుతుందన్నారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రభుత్వం ఇంక కొన్ని సంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారని వోడితల ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!