04-09-2024 NORMAL NEWS 06:57 AM
swarnodayam.com
Telugu Daily News
04-09-2024 06:57 AM By Mandala Yadagiri

ఎస్సీ గురుకుల సెక్రటరీని వెంటనే తొలగించాలి.. -6000 మంది టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. -PPL రాష్ట్ర ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం కో- కన్వీనర్ గడప రాజుస్వేరో

ఎస్సీ గురుకుల సెక్రటరీని వెంటనే తొలగించాలి.. -6000 మంది టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. -PPL రాష్ట్ర ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం కో- కన్వీనర్ గడప రాజుస్వేరో
IMG-20240904-WA1716

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం ఫ్యాకల్టీ తొలగిస్తూ సర్కిలర్ జారీ చేయడం అత్యంత దారుణమని PPL రాష్ట్ర ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం కో- కన్వీనర్ గడప రాజుస్వేరో బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒక్క మెమోతో 250 మంది కుటుంబాలు రోడ్డున పడ్డారన్నారు. అకాడమీక్ మధ్యలో తొలగిస్తే మా బ్రతుకులు ఎలా అని గెస్ట్ ఫ్యాకల్టీ పేర్కొన్నారు. ఇప్పటికే 3 నెలల జీతం ఇవ్వలేదని గెస్ట్ ఫ్యాకల్టీ తెలిపారు అన్నారు. అకడమిక్ ఇయర్ మధ్యలో మమ్ములను తొలగిస్తే మేము ఎలా బ్రతకాలి అని సబ్జెక్ట్ అసోసియేట్ ఆవేదన చెందుతున్నారన్నారు. మేము ఎంతో కష్టపడితేనే ఐఐటీ, ఎన్ఐటిలలో సీట్లు సాధించామని తెలిపారు. ఇప్పుడు ఉన్న విద్యార్థులకు చదువు చెప్పేది ఎవరని, అన్ని గురుకులాల్లో దాదాపు 2500-3000 ఖాళీలు 2024-25 విద్య సంవత్సరంకు కొనసాగింపుకు ఉత్తర్వులు ఇచ్చి అకాడెమీ మధ్యలో తొలగించారన్నారు. అయినప్పటికీ కొత్త నియామకాల పేరిట అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉద్వాసన పలకడం సరికాదన్నారు. మరో వైపు ఖాళీల పేరిట మళ్లీ కొత్తగా పార్ట్ టైం సిబ్బంది నియామకాలు, డెమోలు నిర్వహణ, ట్రైబల్ వెలిఫెర్, మైనార్టీ గురుకులాల్లో కొనసాగించి, సాంఘిక సంక్షేమ గురుకుల్లాలో తొలగించడంతో దళిత విద్యార్థుల భవిష్యత్తును వెనక్కి నెట్టడాన్ని తీవ్రంగా కండిస్తున్నట్లు రాజు స్వేరో పేర్కొన్నారు. బ్రహ్మ కుమారి సంస్థతో కౌన్సిలింగ్ ను వేతిరేకిస్తు, సైకాలజిస్టులతో క్లాసులు చెప్పించాలని డిమాండ్ చేశారు. మా బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని చూస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో తల్లిదండ్రులమంతా ఒకటై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని స్వేరో నెట్వర్క్ ప్రతినిధులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారని
PPL రాష్ట్ర ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం కో – కన్వీనర్ గడప రాజు స్వేరో తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!