Social 1080×1350 • Multi-page
04-09-2024 BREAKING NEWS 07:38 AM
swarnodayam.com
Telugu Daily News

రహదారి నిర్మాణానికి కృషి చేస్తా.! -రైతులకు హామీ ఇచ్చిన వోడితెల ప్రణవ్

రహదారి నిర్మాణానికి కృషి చేస్తా.! -రైతులకు హామీ ఇచ్చిన వోడితెల ప్రణవ్
IMG_20240904_183608

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని బోర్నపల్లి చెరువు కట్టను, రహదారిని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బుధవారం పరిశీలించారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి నుండి ఇప్పల నర్సింగాపూర్ చెరువు కట్ట మీద నుండి రైతులు వ్యవసాయ పనులకు వెళ్ళుటకు చెరువు కట్ట మీద వాహనాలో వెళ్ళటానికి రహదారి లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రహదారి నిర్మిస్తే రెండు గ్రామాలకు వ్యవసాయ పనులకు, వర్తక, వాణిజ్య, వ్యాపారం కొరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుందని స్థానిక రైతులు వోడితల ప్రణవ్ కు వివరించారు. ఈ సందర్భంగా రైతులతో ప్రణవ్ మాట్లాడుతూ బోర్నపల్లి చెరువు కట్టపై రోడ్డు నిర్మాణానికి నిధులు తీసుకొచ్చి పనులు జరిపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన వెంట బోర్నపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!