07-09-2024 NORMAL NEWS 06:19 AM
swarnodayam.com
Telugu Daily News
07-09-2024 06:19 AM By Mandala Yadagiri

ఆదరణకు నోచుకోని మహిమగల గణపతి.. గణపతి నవరాత్రుల కైనా పూజలు అందుకునేనా!?

ఆదరణకు నోచుకోని మహిమగల గణపతి.. గణపతి నవరాత్రుల కైనా పూజలు అందుకునేనా!?
IMG_20240907_171529

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గణపతి నవరాత్రులు వచ్చాయంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజులపాటు శక్తి కొలది వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం గణపతి దేవున్ని ఇంటింటా కొలవడం ఆనవాయితీ. మహిమగల దేవుడు అని తెలిస్తే ఎంత దూరమైనా వెళ్లి ఆ దేవుని చూడడం మనలోనే ఉన్న కోరికలన్నీ కోరుకోవడం సహజమే. కానీ హుజురాబాద్ ప్రాంత ప్రజలు ఎక్కడికో వెళ్లి మొక్కవలసిన అవసరం లేకుండానే సమీపంలోనే ఎంతో మహిమగల గణపతి ఉన్నాడని తెలిసినా కనీసం కన్నెత్తి చూడకపోవడం కొంతవరకు బాధాకరమే. మనం వేలకు వేలు ఖర్చుపెట్టి ఎంతో ఘనంగా గణపతి ప్రతిమలు కొనుక్కొచ్చి వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించుకుంటాము. కానీ చాలా అరుదుగా మాత్రమే స్వయంభుగా వెలసిన వినాయకుని క్షేత్రాలు చాలా అరుదు. అలాంటిదే హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్టకు స్వయంభుగా వెలసిన వినాయకుని గుడి ఉందని ఎంతమందికి తెలుసు. రంగనాయకుల గుట్టకు స్వయంభూగా వెలసిన వినాయకునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు, పూజలు ఏవి లేకుండా ఉన్నాడు. కానీసం ఈ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నవరాత్రులైన మనం తలుచుకుంటే ఎంతో గొప్ప క్షేత్రంగా వెళ్లి విరిసే అవకాశం ఉంది. కోరిన కోరికలు తీర్చే రంగనాయకుల గుట్ట వినాయకుని గుడిలో భక్తులు వెళ్లి నిత్యం తొమ్మిది రాత్రులు ధూప దీప నైవేద్యాలు పెట్టినట్లయితే కోరిన కోర్కెలు నేర్పడడంతోపాటు వారి జీవితం ధన్యమవుతుంది. భక్తులు తలుచుకుంటే ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ వినాయక చవితికైనా భక్తులు రంగనాయకుల గుడిలోని వినాయకునికి నవరాత్రులు మూగిసే వరకు ధూప దప నైవేద్యాలతో పాటు ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!