07-09-2024 NORMAL NEWS 07:27 AM
swarnodayam.com
Telugu Daily News
07-09-2024 07:27 AM By Mandala Yadagiri

యశ్వంత్ మృతికి సంతాపం తెలిపిన వోడితల ప్రణవ్

యశ్వంత్ మృతికి సంతాపం తెలిపిన వోడితల ప్రణవ్
IMG-20240907-WA1896

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామములో విద్యుత్ ఘాతంతో మృతి చెందిన యశ్వంత్ అనే యువకుడి కుటుంబానికి హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులు మృతుడి సొంత గ్రామమైన సిర్సపల్లికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి మృతదేహానికి నివాళులర్పించారు. పండగపూట ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టమని వారి కుటుంబానికి యశ్వంతులేని లోటు తీరనిదాని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మృతదేహం వద్ద నివాళులర్పించిన వారిలో హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ నాయకులు సొల్లుబాబు, సునీత, నరేష్, ఎండి సాదిక్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లి మృత దేహానికి నివాళులు అర్పించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!