08-09-2024 NORMAL NEWS 01:13 AM
swarnodayam.com
Telugu Daily News
08-09-2024 01:13 AM By Mandala Yadagiri

ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్ లైన్ పేమెంట్లు

ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్ లైన్ పేమెంట్లు
IMG-20240908-WA0665


స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ ) తెలంగాణ ప్రయాణికుల కోసం కీలక ప్రకటన చేసింది. బస్సులలో చిల్లర సమస్యలకు చెక్ పెట్టడానికి వీలుగా టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ పేమెంట్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పల్లె వెలుగు సహా అన్ని బస్సులోనూ ఈ విధానాన్ని అమలు చేయబోతుంది. దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. 13,000 కొత్త మిషన్లకు ఆర్డర్లు ఇచ్చారు. అలాగే బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు. జేబులో నగదు లేకున్నా సెల్లులో ఫోన్ పే, గూగుల్ పే ఉంటే సరిపోతుంది ఎక్కడికైనా వెళ్లొచ్చు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!