Social 1080×1350 • Multi-page
08-09-2024 BREAKING NEWS 01:36 AM
swarnodayam.com
Telugu Daily News

టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
IMG-20240908-WA0725

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబర్ 9: నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి)అధ్యక్షుడిగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాదులోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేల్ల మహేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు గూడూరి స్వామిరెడ్డి, రమేష్ లు కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు బోకే అందించి శాలువా కప్పి సన్మానించారు. అలాగే హైదరాబాద్ లో నూతనoగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఎం కోదండరెడ్డిని కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించేలా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కష్టపడి పని చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని దానికి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావడమే ఉదాహరణ అని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!