Social 1080×1350 • Multi-page
08-09-2024 BREAKING NEWS 09:10 AM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక సదస్సుకు వేలాదిగా తరలిరండి… -కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్

కరీంనగర్ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక సదస్సుకు వేలాదిగా తరలిరండి… -కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్
IMG-20240908-WA1178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

ఈనెల 10న మంగళవారం నాడు కరీంనగర్ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక సదస్సుకు వేలాదిగా తరలి రావాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శనిగరపు వెంకటేష్ శనిగరపు, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శనిగరపు స్వరూప ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ పద్మనగర్ లోని ఇందిర గార్డెన్ ఫంక్షన్ హాల్లో సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణపై సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మానకొండూర్ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, టిపిఎస్ జాక్ రాష్ట్ర చైర్మన్ గజ్జల కాంతం, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. మాదిగలు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని వారు కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!