09-09-2024 NORMAL NEWS 12:40 AM
swarnodayam.com
Telugu Daily News
09-09-2024 12:40 AM By Mandala Yadagiri

ప్రభుత్వ కళాశాలలో తెలంగాణా భాషా దినోత్సవం వేడుకలు

ప్రభుత్వ కళాశాలలో తెలంగాణా భాషా దినోత్సవం వేడుకలు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణా భాషా దినోత్సవం మరియు ప్రజాకవి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్ వి అంజనేయరావు కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించారన్నారు. అంతేకాకుండా తెలంగాణా భాషా మాండలికాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి అని, కాళోజీ రచించిన ‘నా గొడవ’ రచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల తెలుగు అధ్యాపకులు తులసి దాసు, శైలజ, పున్నం చందర్, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!