09-09-2024 NORMAL NEWS 02:03 AM
swarnodayam.com
Telugu Daily News
09-09-2024 02:03 AM By Mandala Yadagiri

హుజురాబాద్ మున్సిపల్ మూడో వార్డులో దూసుకుపోతున్న యువనేత రాము!

హుజురాబాద్ మున్సిపల్ మూడో వార్డులో దూసుకుపోతున్న యువనేత రాము!
IMG-20240909-WA0936

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని మూడో వార్డులో బిఆర్ఎస్ యువనేత తాటిపాముల రాము పలు సేవా కార్యక్రమాలతో ప్రజలలో దూసుకుపోతున్నారు. అ వార్డు పరిధిలో ఏలాంటి చిన్న సమస్య ఉన్న తక్షణమే స్పందించే గుణం కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. అవార్డు పరిధిలో ప్రధాన రహదారిపై మ్యాన్ హోల్ ఉండగా తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారుల దృష్టి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించారు. ఇటీవల వర్షాలకు వరద నీరు పలువురి ఇళ్లల్లో చేరుతుండడంతో మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి నీరు మళ్లీచ్చేందుకు కృషి చేశారు. గణపతి నవరాత్రులలో మూడో వార్డులో ప్రతిష్టించిన పలు విగ్నేశ్వరుల మంటపాలను సందర్శించి పూజలలో పాల్గొని యూత్ సభ్యులలో దైవభక్తిని ప్రేరేపించారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ రాము మూడో వార్డులో సామాజిక సేవలలో ముందు నిలుస్తూ.. ప్రజలకు తగిన చేయూతను అందిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాముకి మా మద్దతు అంటూ పలువురు స్వచ్ఛందంగా ప్రకటించడం కొసమరుపు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!