09-09-2024 NORMAL NEWS 06:38 AM
swarnodayam.com
Telugu Daily News
09-09-2024 06:38 AM By Mandala Yadagiri

దేశ భవిష్యత్తు యువత చేతిలోనే టౌన్ సిఐ తిరుమల్ గౌడ్

దేశ భవిష్యత్తు యువత చేతిలోనే టౌన్ సిఐ తిరుమల్ గౌడ్
IMG_20240909_172148

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలోనే ఉంది అని హుజురాబాద్ టౌన్ సిఐ జీ తిరుమల్ గౌడ్ పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో కాలోజి నారాయణరావు జయంతి సందర్భంగా మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విశ్రాంత అధ్యాపకులు సాహిత్య వేత్త, తత్వవేత్త, కవి, రచయిత ఎస్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా హుజురాబాద్ పట్టణ సిఐ తిరుమలేష్ గౌడ్, మరియు ఎస్ఐ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సీఐ తిరుమల గౌడ్ మాట్లాడుతూ యువత పెడదారిన పడకుండా డ్రగ్స్ మాఫియాను అంతం చేయడం కోసం ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలన్నారు. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు గురువులు చెప్పే మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఆడవాళ్లపై జరిగే అకృత్యాలను ఆపాలంటే కేవలం ఆ మహిళా విద్యార్థుల వల్ల సాధ్యపడుతుందన్నారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య వేత్త ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని, తెలుగు వెలుగులలో అక్షరాల వడివడిలో తెలుగు భాష సాహిత్యంలో చదువులో ప్రతి విద్యార్థి శ్రద్ధ చూపాలని అన్నారు. కవులు, రచయితలు మేధావులు వారి రచనలు చదవడమే కాకుండా వారి ఆలోచన విధానాలను అవలంబించాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పునాదులని, నిక్కచ్చిగా వివరించారు. తల్లిదండ్రుల గొప్పతనం, గురువులకు గొప్పదనం విద్యార్థులకు అలవోకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి, తెలుగు అధ్యాపకుడు, కవి, గాయకులు మేకల నవీన్ కుమార్, అధ్యాపకులు తిరుపతి, భద్రయ్య, రమేష్, అనిల్, వేణు, వెంకటేష్, స్వామి తోపాటు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కాళోజీ జయంతి

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.ఇందిరాదేవి మాట్లాడుతూ తెలంగాణ భాష గుర్తింపు కోసం కాళోజీ ఎనలేని కృషి చేసాడని అందుకే ఆయన జీవితం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తెలుగు విభాగం అసోసియెట్ ప్రొఫెసర్ వైస్ ప్రిన్సిపాల్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ సామాజిక అసమానతలు రూపుమాపడానికి కాళోజీ కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొన్నాడని కొనియాడారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలంగాణ జాతి ఆయనకు ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకాడక్ కోఆర్డినేటర్ కె.లింగారెడ్డి అధ్యాపకులు డా. సరళ ఝాన్సి, డా. కె నరెందర్, మహిపాల్ రెడ్డి, డా. ఓదెలు, డా. స్వరూపారాణి, డా.రేణుక, డా. సుమలత, పల్లవి, రమ, మంగమ్మ, స్వప్న మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!