Social 1080×1350 • Multi-page
09-09-2024 BREAKING NEWS 08:17 AM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి సూపర్ ఇంటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి…

జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి సూపర్ ఇంటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి…
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ ఇన్చార్జి సూపర్ ఇంటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జి సూపర్ ఇంటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వనరులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని, భవిష్యత్తులో ఉన్నత అధికారుల దృష్టికి ఈ హాస్పిటల్ లో నెలకొన్న సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేము, మా సిబ్బంది పని చేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నానని కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇన్చార్జి సూపర్ ఇంటెండెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శ్రీకాంత్ రెడ్డి ఇన్చార్జి సూపరింటెండెంట్ కావడం పట్ల పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!