Social 1080×1350 • Multi-page
09-09-2024 BREAKING NEWS 10:02 AM
swarnodayam.com
Telugu Daily News

ఈ రోడ్డును బాగుచేయరూ..! అడుగు అడుగుకో గుంత.. అవస్థలు పడుతున్న వాహనదారులు.

ఈ రోడ్డును బాగుచేయరూ..! అడుగు అడుగుకో గుంత.. అవస్థలు పడుతున్న వాహనదారులు.
IMG_20240909_210710

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని బోర్నపల్లిలో అడుగు అడుగుకు ఓ గుంత ఏర్పడడంతో సైదాపూర్ వెళ్ళు అనేక అవస్థలు పడుతున్నారు. గుంతలకు తోడు ఈ రహదారి మూల మలుపుల వద్ద రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సైదాపూర్, హుస్నాబాద్ కు రవాణా ఎక్కువగా ఈ దారిగుండానే జరుగుతుంది. సైదాపూర్ పరిసర పల్లె ప్రాంతాలనుండి ప్రజలు ఎక్కువగా హుజురాబాద్ కు ప్రయాణిస్తూ ఉంటారు. అధిక బరువు కల్గిన వాహనాలు, చింతలపల్లి గోడౌన్ లారీలు తిరుగుతుండడం వల్ల రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల బోర్నపల్లి భూలక్ష్మి సమీపంలో మూలమలుపు వద్ద ఈమద్యనే బోర్నపల్లికి చెందిన ముగ్గురు యువతి యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. చిన్న చినుకు పడితే చాలు రోడ్డు అంతా బురదనీటిమయంగా మారుతుంది. రాత్రివేళ రహదారి వెంట వీధిలైట్లు లేక ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ రోడ్డులో వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్నారు. సంబందిత అధికారులకు వాహనదారులు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు గానీ మున్సిపల్ అధికారులు గానీ వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని బోర్నపల్లి గ్రామస్తులతో పాటు పలువురు వాహనదారులు మొరపెట్టుకుంటున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!