Social 1080×1350 • Multi-page
11-09-2024 BREAKING NEWS 07:37 AM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సైగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న రాంపూర్ యువకుడు.. గణేష్ నిమజ్జనం అనంతరం పోస్టింగ్!

ఎస్సైగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న రాంపూర్ యువకుడు.. గణేష్ నిమజ్జనం అనంతరం పోస్టింగ్!
IMG-20240911-WA1667

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఎస్సైగా బుధవారం హైదరాబాదులోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేశాడు. ట్రైనింగ్ పూర్తి కావడంతో లక్ష్మణ్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వినాయక చవితి బందోబస్తు తర్వాత పోస్టింగ్ ఇస్తారని ఆయన అన్నారు. గతంలో కరీంనగర్, సిరిసిల్లలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన లక్ష్మణ్ కష్టపడి చదివి ఎస్సైగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నందున తల్లి అరుణ, బావ బూదారపు కుమారస్వామితో పాటు అన్నా రాము ఇతర ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఎస్సైగా పదవి చేపట్టడంతో పట్టణంలోని పలువురు స్నేహితులు, బంధువులు అభినందనలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!