Social 1080×1350 • Multi-page
11-09-2024 BREAKING NEWS 07:55 AM
swarnodayam.com
Telugu Daily News

డిజిపి జితేందర్ ను కలిసిన ప్రజాకవి నాగుల సత్యంగౌడ్

డిజిపి జితేందర్ ను కలిసిన ప్రజాకవి నాగుల సత్యంగౌడ్
IMG-20240911-WA1343

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రజాకవి, రచయిత, సాహితివేత్త, తత్వవేత్త ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ నాగుల సత్యంగౌడ్ హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలో ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా డిజిపి డాక్టర్ జితేందర్ ని సోమవారం తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, బొకేను అందజేసి, పట్టు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజాకవి ఆధ్యాత్మిక గురువు సత్యంగౌడ్ మాట్లాడుతూ … ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో మెదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహించిన తీరులో పోలీస్ శాఖ అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరు మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటు విలువైన పౌరులుగా ఎదగాలన్నారు. ప్రతి పౌరుడు దేశ రక్షణలో, సమాజ సేవలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి సమాజ సేవలో భాగస్వాములు కావాలని సత్యం గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మనపల్లి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ ఐఏఎస్, జై జవాన్ జై కిసాన్, భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసిడి ఆర్గనైజేషన్ పలు విలువలు పెంపొందించే సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఖదరి వెంకటరమణారావు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!