12-09-2024 NORMAL NEWS 07:57 AM
swarnodayam.com
Telugu Daily News
12-09-2024 07:57 AM By Mandala Yadagiri

దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్!బ్రోకర్ ఎవరు నువ్వా నేనా?

దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువు గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్!బ్రోకర్ ఎవరు నువ్వా నేనా?
IMG-20240912-WA1321

పార్టీ మారలేదని చెప్పిన గాంధీ గులాబి కండువా కప్పుకో

-చీర, గాజుల సంస్కృతిని నేర్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బ్రోకర్ అని నన్ను సంబోధించే ముందు పూటకో పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ బ్రోకరా లేక ఒకే పార్టీలో ఉన్న నేను బ్రోకరా ఆలోచించుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఉదయం గాంధీ ఇంటికి వెళ్తానని అనుకుంటే పొద్దున ఐదు గంటలకే నా ఇంటి చుట్టూ కంచెలు వేసి ముందస్తు అరెస్టు చేశారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్వయంగా గాంధీనే చెప్పారని, నేను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాదా సహచరి ఎమ్మెల్యేగా ఇంటికి వస్తానంటే గాంధీకి అంత భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఇంటికి వచ్చి గులాబి కండువా కప్పుకొని ఇద్దరం కలిసి కెసిఆర్ దగ్గరికి వెళ్లి ప్రెస్ మీట్ పెడదామని చెప్పాను తప్ప తన్నుకుందాం గుద్దుకుందాం అని చెప్పలేదు కదా అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మారనప్పుడు గులాబి జెండా పెట్టుకోవడానికి అభ్యంతరాలు ఏమిటో చెప్పాలన్నారు. గాంధీ ప్రెస్ మీట్ పెట్టిన్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది నిజం కాదా చెప్పాలన్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తమే ఐదుగురు ఉన్నప్పుడు 10 మందిని తీసుకొస్తానని నేనెలా చెబుతానని అన్నారు. గాంధీకి పూర్తి అవగాహన లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి నేనేం చేశాను స్వయంగా రేవంత్ రెడ్డిని అడగాలని గాంధీకి సూచించారు. చీర, గాజుల సంస్కృతి నేర్పిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని చీర గాజులు వేసుకొని బస్సు ఎక్కమని చెప్పి సంస్కృతి మొదలు పెట్టారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అండదండలతో హుజురాబాద్లో ఈటలను వంద కిలోమీటర్ల లోతులో బొంద పెట్టింది హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరవేసింది గుర్తుంచుకోవాలన్నారు. నేను తెలంగాణలో పుట్టిన బిడ్డనని గాంధీ గుర్తుంచుకోవాలని, ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డమీద కూర్చొని సవాల్ విసిరితే చూస్తూ ఊరుకోమని అన్నారు. శుక్రవారం 11 గంటలకు మేడ్చల్ జిల్లా కార్యాలయం నుంచి రాజుగారి ఆధ్వర్యంలో శంబునిపల్లి గాంధీ గారి ఇంటికి పెద్ద ఎత్తున బయలుదేరుతామని అన్నారు. వేలాదిమంది కార్యకర్తలు గాంధీ ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేసి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తూ కెసిఆర్ వద్దుకు తీసుకువస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని సిగ్గు లేదా అంటూ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష నాయకుని ఉంచామని, ఇప్పుడు పార్లమెంట్లో పిఎసి చైర్మన్ ఎవరుండాలని ఆయన ప్రశ్నించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!