12-09-2024 NORMAL NEWS 08:07 AM
swarnodayam.com
Telugu Daily News
12-09-2024 08:07 AM By Mandala Yadagiri

కౌశిక్ రెడ్డి కాదు మేము పంపిస్తాం చీర, గాజులు.. చెప్పులు పట్టుకుని మీ పార్టీ ప్రజా ప్రతినిదుల దగ్గరికి వెళ్ళండి! -సోషల్ మీడియా మహిళా నాయకురాలు పావనిగౌడ్

కౌశిక్ రెడ్డి కాదు మేము పంపిస్తాం చీర, గాజులు.. చెప్పులు పట్టుకుని మీ పార్టీ ప్రజా ప్రతినిదుల దగ్గరికి వెళ్ళండి! -సోషల్ మీడియా మహిళా నాయకురాలు పావనిగౌడ్
IMG-20240912-WA1318

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పార్టీ ఫిరాయింపులు చేసి వేరే పార్టీకి వెళ్లిన వారికి చీర గాజులు పంపిస్తామని కౌశిక్ రెడ్డి అంటే అంతగా నొచ్చుకొని చెప్పులు చూపించిన మహిళ నాయకురాళ్ళు మహిళలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎందుకు స్పందించలేదని, అప్పుడు చెప్పులు గుర్తుకు రాలేదా అని సోషల్ మీడియా మహిళ నాయకురాలు పావనిగౌడ్ అన్నారు. గురువారం కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తోటి మహిళ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కలు అనిచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చెప్పులు ఎందుకు పట్టుకోరాలేదు చెప్పాలన్నారు. చెంచు మహిళపై అగయిత్యం జరిగినప్పుడు, గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు ఈ నాయకురాలు ఎక్కడ దాక్కున్నారు అని ఘాటుగా స్పందించారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఏం చేశారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను తప్పిపుచ్చుకుంటూ వస్తున్నా మీరు కౌశిక్ రెడ్డి పై మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపు చేసిన వారిపై సరిగానే మాట్లాడారని, మా నాయకుడు కౌశిక్ రెడ్డి అవసరం లేదని, మేమే ఆ నాయకులు ఇంటికి వెళ్లి మరి చీర, గాజులు పంపిణీ చేస్తామని పావని గౌడ్ అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!