Social 1080×1350 • Multi-page
12-09-2024 BREAKING NEWS 09:39 AM
swarnodayam.com
Telugu Daily News

వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
IMG_20240912_203416

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 16న హుజురాబాద్ లో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవ ముగింపు నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్ లో గల కాకతీయ కెనాల్ వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల గురించి ప్రత్యక్షంగా అధికారులతో కలిసి పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా పట్టణంలోని వినాయక విగ్రహాలను ఒక క్రమ పద్ధతిలో నిమజ్జనం జరిగే విధంగా చూడడానికి చర్యలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్ల గురించి, త్రాగునీరు లైటింగ్, వైద్య శిబిరం ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే విజయవంతంగా నిమజ్జనాన్ని ముగించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి తిరుమల్ గౌడ్, ఎస్సై యూనస్ అహ్మద్ అలీ, SRSP ఇరిగేషన్ Dy.EE రాము, హుజురాబాద్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ చందు, కార్యాలయ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, ఇంచార్జి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సాంబరాజు, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ యం కిషన్ రావు, సానిటరీ జవాన్లు ప్రతాప రాజు, అనిల్, రమేష్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!