Social 1080×1350 • Multi-page
12-09-2024 BREAKING NEWS 09:16 PM
swarnodayam.com
Telugu Daily News

బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్! పోలీసుల తీరుపై బిఆర్ఎస్ ఆగ్రహం.

బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్! పోలీసుల తీరుపై బిఆర్ఎస్ ఆగ్రహం.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ కు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివాదం నేపథ్యంలో హుజురాబాద్ పోలీసులు స్థానిక బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. నిన్న హైదరాబాదులో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తన అనుచరులు వెళ్లి దాడి చేయడంతో పాటు, కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వసం చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది విధితమే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను నిన్న అరెస్ట్ చేసి నిర్బంధించిన పోలీసులు తీరును నిరసిస్తూ శుక్రవారం నేడు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ జండా ఎగరేవేసి తమ సత్తా ఏంటో చూపెడతామని ప్రతి సవాల్ చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తుగా పోలీసులు ఎక్కడికి అక్కడ అరెస్టు చేసి స్టేషన్లో బంధించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. అధికార పార్టీ నాయకులకు ఒకరకంగా ప్రతిపక్ష నాయకులకు మరో రకంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పలువురు మేధావులు తప్పుపడుతున్నారు. తాము వెళ్లడం లేదని ఇంట్లోనే ఉన్నామని కావాలని రాత్రి వేళలో సడి సప్పుడు కాకుండా వచ్చి తమను బలవంతంగా అదుపులోకి తీసుకొని హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో బంధించారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించడం మాని చట్ట ప్రకారం నడుచుకోవాలని, తమను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం మానుకొని వదిలేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హుజరాబాద్ లో ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడూరు ప్రతాపరెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గనిశెట్టి ఉమామహేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు చొల్లేటి కిషన్ రెడ్డి, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, పో రెడ్డి దయాకర్ రెడ్డి, ఎల్లయ్య, పంజాల సదానందం గౌడ్, కానుగంటి శ్రీనివాస్, బత్తుల సమ్మయ్య తదితరులున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!