Social 1080×1350 • Multi-page
13-09-2024 BREAKING NEWS 09:07 AM
swarnodayam.com
Telugu Daily News

కౌశిక్ రెడ్డి ఖబర్దార్.!పిచ్చిపిచ్చిగా కూతలు కూస్తేనీ అంతు చూస్తాం.. -కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు వార్నింగ్

కౌశిక్ రెడ్డి ఖబర్దార్.!పిచ్చిపిచ్చిగా కూతలు కూస్తేనీ అంతు చూస్తాం.. -కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు వార్నింగ్
IMG-20240911-WA1910

–ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కించపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి..

–లేకపోతే బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలి..

–అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను
బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నీది కాదా..?

–మహిళా మణులను కించపరుస్తావా..

–కౌశిక్ నీకు బడితే పూజ చేయడం ఖాయం..

–హెచ్చరించిన రాజేందర్ రావు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:

బతకడానికి వచ్చినవ్ నీవేంది అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కించపరిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. పాడి కౌశిక్ నీ రౌడీయిజం నీ దగ్గర పెట్టుకోవాలని.. ఖబర్దార్.. ఎవరిని పడితే వారిపై పిచ్చి కూతలు కూస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. గురువారం కరీంనగర్ లో వెలిచాల రాజేందర్ రావు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీకి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడిని సస్పెండ్ చేయాలని సూచించారు. చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ ను పార్టీలో ఉంచుకుంటే మరింత నష్టపోవడం ఖాయమని హితవు పలికారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో హైదరాబాద్ కు బతకడానికి వచ్చిన వాళ్ళందరూ మన వాళ్లేనని చెప్పిన విషయం మర్చిపోయారా.. కౌశిక్ అని ప్రశ్నించారు. వారి కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కెసిఆర్ మాట్లాడిన విషయం మర్చిపోయారా.. కౌశిక్ అని మండిపడ్డారు. అరికెపూడి గాంధీని బతకడానికి వచ్చినవని నీవే స్వతహాగా వాక్యాలు చేశావా.. లేకుంటే కెసిఆర్ వెనక ఉండి నిన్ను మాట్లాడించారా.. ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చిన వారు ఓట్లు వేస్తేనే హైదరాబాదులో బిఆర్ఎస్ కు సీట్లు వచ్చాయని, అలాంటప్పుడు కించపరిచినట్లు మాట్లాడితే ఇది ఎంత వరకు కరెక్ట్ అని పేర్కొన్నారు. వారు ఓట్లు వెయ్యకపోతే మీ పార్టీకి గుండు సున్న మాత్రమే మిగిలేదని, దగుల్బాజీ మాటలు మాట్లాడడం బంద్ చేయాలని లేకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. బతకడానికి వచ్చిన వారిని అన్ని పదవుల్లో భాగస్వాములు చేస్తామని నాడు కెసిఆర్ చెప్పిన మాట వాస్తవం కాదా.. ప్రశ్నించారు.

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు చీరెలు, గాజులు పంపిస్తున్నానని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మహిళా మణులంటే అంత చులకన భావం ఎందుకని మండిపడ్డారు. సమాజంలో మహిళలకు ఉన్నతమైన గౌరవం ఉందని, అలాంటి వారిని కించపరచడం నీచ సంస్కృతి కాదా.. కౌశిక్ అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచిన మీకు వారు బడితే పూజ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

నీ రాజకీయమంతా వివాదాస్పదమేనని, ఎవరిని లెక్క చేయకుండా ఇష్ట రాజ్యాంగా మాట్లాడడం, ప్రవర్తించడం నీకు నిత్యం అలవాటైందని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నీది కాదా అని మండిపడ్డారు. నాకు ఓటు వెయ్యకపోతే మా కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి ఎన్నికల్లో సానుభూతి పొందిన నీచునువి నీవు కాదా.. అని మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే నిన్ను చీదరించుకుంటున్నారని అసలు విషయం వారికి బోధపడిందని పేర్కొన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు నడిపిస్తున్న రాజకీయ పావులో బలి కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా చిల్లర మల్లరగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై మాట్లాడడం బంద్ చేయాలని హెచ్చరించారు. పాడి కౌశిక్ నీ వైఖరి మార్చుకోకపోతే మాత్రం నీ అంతు చూడడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు వార్నింగ్ ఇచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!