13-09-2024 NORMAL NEWS 09:18 AM
swarnodayam.com
Telugu Daily News
13-09-2024 09:18 AM By Mandala Yadagiri

సీతారాం ఏచూరి మృతి తీరని లోటు! -వెలిచాల

సీతారాం ఏచూరి మృతి తీరని లోటు! -వెలిచాల
IMG-20240913-WA1195

పేదల పక్షాన గళం వినిపించిన నేత సీతారాం ఏచూరి

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి రాజకీయాల్లో తీరని లోటు అని, నిత్యం పేదల సమస్యలపై గళం వినిపించిన మహానేత సీతారం ఏచూరి అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సీతారాం ఏచూరి మరణం పట్ల రాజేందర్ రావు శుక్రవారం విచారం వ్యక్తం చేశారు. సీతారాం గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్ది మంది తెలుగువారిలో ఏచూరి ప్రస్థానం ప్రత్యేకమైనదని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఏచూరి గారు చేసిన పోరాటం ఈ తరానికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కాలంలో పేదల సమస్యలపై నిత్యం పోరాడి వారి పెన్నిధిగా పేరు సంపాదించారని తెలిపారు. ఏచూరి మృతి దేశ రాజకీయాలకే తీరని లోటు అని చెప్పారు. ఏచూరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు వెలిచాల రాజేందర్ రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!