13-09-2024 NORMAL NEWS 09:39 AM
swarnodayam.com
Telugu Daily News
13-09-2024 09:39 AM By Mandala Yadagiri

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మేలు! -బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు అనుమండ్ల శోభారాణి

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం మేలు! -బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు అనుమండ్ల శోభారాణి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : గర్భిణీ స్త్రీలు పోషకాహారంను తీసుకోవాలని దానివల్ల వారికి ఎంతో మేలు జరుగుతుందని బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు అనుమాoడ్ల శోభారాణి అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలు నిర్వహించారు. ఈ సందర్భంగా శోభారాణి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అలాగే సిడిపిఓ జి సుగుణ మాట్లాడుతూ… పోషణ అభియాన్ కార్యక్రమం కింద గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ జరీనా మాట్లాడుతూ… గర్భిణీ స్త్రీలు సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు సరైన పోషకాలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిటిసి కౌన్సిలర్ సుజాత, ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఆండ్రాసు పద్మ, రాజశ్రీ, డీసి నాగరాజు, బిసి నాగరాజు, ఐటీ ప్రవీణ్ రామకృష్ణ, రోహిణి, రామకృష్ణ, అంగన్వాడీ టీచర్స్, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!