Social 1080×1350 • Multi-page
13-09-2024 BREAKING NEWS 09:20 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి ఆకస్మిక మృతి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తుమ్మేటి ఆకస్మిక మృతి
IMG_20240914_081836

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు తుమ్మెటీ సమ్మిరెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. తమ్మి రెడ్డికి అర్ధరాత్రి ఒక గంటకు గుండెపోటు రావడంతో వారి కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి తీసుకు వచ్చారు. వైద్యులు పరీక్షించి వైద్యం చేస్తుండగానే చికిత్స పొందుతూ మృతి చెందారు. తుమ్మేటి సమ్మిరెడ్డి చదువుకునే సమయంలోనే ఎన్ ఎస్ యుఐ విద్యార్థి నాయకుడిగా కొనసాగారు. మాజీ PCC కార్యదర్శిగా, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంఛార్జిగా, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గా తుమ్మెటి సమ్మిరెడ్డి సేవలందించారు. దివంగత మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎం సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అలంకరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుకుగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సమ్మిరెడ్డి అనుకోకుండా అర్థరాత్రి ఒక్కసారిగా గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులనే కాక అతని అభిమానులను పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

–తుమ్మేటి మృతి పట్ల మంత్రి పొన్నం, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ ల సంతాపం

నా మిత్రుడు, సహచర NSUI నాయకుడు, జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటీ సమ్మిరెడ్డి రాత్రి జమ్మికుంటలో ఆకస్మికంగా మృతి నన్ను తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపంను తెలియ చేస్తూ వారి కుటుంబము కు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అని అన్నారు. అలాగే తుమ్మేటి సమీరెడ్డి మృతి పట్ల హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ వారి కుటుంబ సభ్యులకు వేర్వేరు ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!