Social 1080×1350 • Multi-page
13-09-2024 BREAKING NEWS 10:08 PM
swarnodayam.com
Telugu Daily News

తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మిక మృతి బాధాకరం.. – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మిక మృతి బాధాకరం.. – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
1000524306

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సమ్మిరెడ్డి ఎన్ ఎస్ యుఐ విద్యార్థి నాయకుడి నుంచి సుదీర్ఘకాలం పనిచేస్తూ కాంగ్రెస్ లో అంచలంచెలుగా ఎదిగారని, ఆయన మృతి పార్టీకి, నాయకులకు, కార్యకర్తలకు తీరని లోటు అని చెప్పారు. సమ్మిరెడ్డి మృతి పట్ల వెలిచాల రాజేందర్ రావు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!