15-09-2024 NORMAL NEWS 01:38 AM
swarnodayam.com
Telugu Daily News
15-09-2024 01:38 AM By Mandala Yadagiri

మార్నింగ్ వాకర్స్ తో మమేకమైన ఆల్ఫోర్స్ అధినేత!

మార్నింగ్ వాకర్స్ తో మమేకమైన ఆల్ఫోర్స్ అధినేత!
IMG-20240915-WA0672

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.వి నరేందర్ రెడ్డి మమేకమై మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ నుండి అపూర్వ స్పందన లభించడం శుభ పరిణామం. ఏ వాకర్స్ నోట విన్న మేము ఆల్ఫోర్స్ పూర్వ విద్యార్థులం లేదా మా పిల్లలు ఆల్ఫోర్స్ లో విద్యను అభ్యసించారు, మరికొందరు మా పిల్లలు ప్రస్తుతం అల్ఫోర్స్ లో చదువు కొనసాగిస్తున్నారని చెప్తూ సుమారు మూడు గంటల పాటు విఎన్ఆర్ తో మార్నింగ్ వాకింగ్ కొనసాగించారు. అడగడునా నరేందర్ రెడ్డితో తోడు నిలుస్తూ సార్ తమ ఓటు, తమ పిల్లల ఓటు సైతం తమరికే అంటూ పలువురు వాకర్స్ స్వచ్ఛందంగా హామీ ఇచ్చి ముందస్తు శుభాకాంక్షలు తెలపడం కోసమేరుపు !

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!