Social 1080×1350 • Multi-page
15-09-2024 BREAKING NEWS 12:09 PM
swarnodayam.com
Telugu Daily News

ఆడియో వైరల్ కేసులో ఒకరి అరెస్ట్

ఆడియో వైరల్ కేసులో ఒకరి అరెస్ట్
1000000081

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నాగార్జున డైరీ యజమానితో ఫోన్లో రూ.15 లక్షలు డబ్బులు అడిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన తిప్పారపు సంపత్ తాను నాగార్జున డైరీ యజమాని ప్రభాకర్ రావును డబ్బులు అడిగినట్లు అవుతున్న వీడియో వైరల్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి సూచనల మేరకు విచారణ జరుపగా ఓ టీవీ ఛానల్, ఓ యూట్యూబ్ ఛానల్ సీఈవో పి సమ్మయ్య ఈ సంభాషణను యూట్యూబ్లో పెట్టగా అట్టిది వైరల్ అయ్యిందని తెలిపారు. కాగా ఫోన్లో మాట్లాడిన వారిని గుర్తించడానికి తాను, ఎస్సై యూనస్ టీముతో కలిసి విచారణ జరపగా పెద్ద కోమటిపల్లికి చెందిన జగన్ తో మాట్లాడించినట్లు వెల్లడయిందన్నారు. దీంతో శనివారం హుజురాబాద్ బస్సు డిపో క్రాస్ దగ్గర సమ్మయ్య గౌడ్ ను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సమ్మయ్య పై గతంలో భూపాల్పల్లి జిల్లాలో రౌడీ షీటరు, ఐదు కేసులు ఉన్నాయని, సమ్మయ్య డబ్బులు సంపాదించాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!