Social 1080×1350 • Multi-page
16-09-2024 BREAKING NEWS 12:01 PM
swarnodayam.com
Telugu Daily News

సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

సెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
IMG_20240916_225202

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ.. భారతరత్న, మనందరి మార్గదర్శి, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకురావడానికి మనం ఉపయోగిస్తున్న సాంకేతిక టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి గొప్ప నేత రాజీవ్ గాంధీ అన్నారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్షి , మాజీ పీసీసీ అధ్యక్షులు , మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్ లు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!