Social 1080×1350 • Multi-page
17-09-2024 BREAKING NEWS 12:08 AM
swarnodayam.com
Telugu Daily News

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం-మోడీ జన్మదిన వేడుకలు

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం-మోడీ జన్మదిన వేడుకలు
IMG_20240917_110554

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవo వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిఎంఎస్ కాంప్లెక్స్ లో భారత మాతకు పూల దండ సమర్పించి జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది జన్మదినం సందర్భంగా హుజురాబాద్ సబ్ జైలు ఆవరణంలో అమ్మ పేరు మీద బిజెపి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటడం జరిగింది. ఆనంతరం హుజురాబాద్ పట్టణంలోని బూత్ లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కేసరి శేషయ్య, జిల్లా కార్యవర్గ సభ్యలు తూముల శ్రీనివాస్, మంచికట్ల సదానందం, కళ్లెపు సుధాకర్ రావు, కొలిపాక శ్రీనివాస్, జిల్లా ఓబీసీ ఉపాధ్యాక్షులు రావుల వేణు, శక్తి కేంద్ర ఇంచార్జీలు తిప్పబత్తిని రాజు, నరాల రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ పోతుల సంజీవ్, దళిత మోర్చా అధ్యక్షులు బోరగాల సారయ్య, బూత్ అధ్యక్షుడు తాళ్ళపెల్లి దేవేంద్ర, సమ్మయ్య, గుడిపాటి కొండల్ రెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!