17-09-2024 NORMAL NEWS 03:22 AM
swarnodayam.com
Telugu Daily News
17-09-2024 03:22 AM By Mandala Yadagiri

తెలంగాణ తల్లి విగ్రహాలకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం..

తెలంగాణ తల్లి విగ్రహాలకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం..
IMG-20240917-WA1536


మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశానుసారం హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంఘం ఐలయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ధోరణికి నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు, చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేయడం జరుగుతుందని పార్టీ అధ్యక్షుడు ఐలయ్య తెలిపారు. అలాగే మండలంలోని కందుగుల గ్రామంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడి బిఆర్ఎస్ నేతలు పాలాభిషేకం నిర్వహించారని ఆయన తెలిపారు. పెద్ద పాపయ్యపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పోచంపల్లి సదయ్య, యూత్ అధ్యక్షుడు కత్తుల రాజు, మాజీ సర్పంచ్ పోరెడ్డి రజిత దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వైద్యుల శిరీష ముకుందరెడ్డి, యూత్ నాయకులు తునికి నరేష్, చందగల్లా రాజు, గిన్నారపు ప్రవీణ్, ఫోసు శ్రీనివాస్, అభి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!