17-09-2024 NORMAL NEWS 06:12 AM
swarnodayam.com
Telugu Daily News
17-09-2024 06:12 AM By Mandala Yadagiri

సాయి మానసిక దివ్యాంగులకు అన్నదానం

సాయి మానసిక దివ్యాంగులకు అన్నదానం
IMG-20240917-WA1881

నిరాశ్రయులకు అండగా..
వొడితల కుటుంబం

.-నిరాశ్రయులకు, అనాధలకు అండగా ఉంటూ మేమున్నామంటూ చేయూత

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వొడితల కుటుంబ సభ్యులు.
మాజీ రాజ్యసభ సభ్యులు వోడితల రాజేశ్వరరావు సతీమణి వోడితల శారదాదేవి వర్ధంతి సందర్భంగా జమ్మికుంటలోని సాయి మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులందరికీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భోజనంతో పాటుగా పండ్లు, స్వీట్స్ తదితర అన్ని పదార్థాలు కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ పరంకుశం కృష్ణస్వామి దంపతులు, డాక్టర్ బుచ్చిబాబు, సంతోష్, ప్రముఖ వ్యాపారవేత్త ముక్క బాబాన్నతో పాటు పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు, ఆశ్రమ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమ అభివృద్ధికి చేయూతనిస్తున్న వోడితల కిషన్ రావు, వోడితల శ్రీనివాసరావు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కు ఆశ్రమ వ్యవస్థాపకులు బుచ్చి రాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!