17-09-2024 NORMAL NEWS 07:38 AM
swarnodayam.com
Telugu Daily News
17-09-2024 07:38 AM By Mandala Yadagiri

పేరియర్ ఇవి రామస్వామి 146వ జయంతోత్సవ వేడుకలు

పేరియర్ ఇవి రామస్వామి 146వ జయంతోత్సవ వేడుకలు
IMG-20240917-WA1952

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పేరియర్ ఇవి రామస్వామి 146వ జయంతోత్సవం హుజురాబాద్ లోని విజ్ఞాన వికాస కేంద్రములో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రొంటాల బుచ్చయ్య అధ్యక్షతన పెరియార్ ఇవీ రామస్వామి చిత్రపటానికి పూలమాల వేసి సంద్యల వెంకటేష్ ప్రారంభం చేశారు. పలువురు పెరియర్ ఇవి రామస్వామి గురించి మాట్లాడడం జరిగింది.
పెరియర్ ఒక ఆలోచన గని ఆయన వివేకానికి విచక్షణకు మానవరూపం ఆయన ఆలోచించని విషయం ఏదీ లేదన్నారు. అది ఏ రంగమైన దానిపై ఆయన వాక్యానించాడని, ఆయన పరిష్కరించని చిక్కు ప్రశ్నలే లేవు అన్నారు. ఆయన ఆలోచనలు విశ్వదాప్యం అందుకే తమిళ కవి భారతి దర్శన్ కెరియర్ వర్ణిస్తూ ఆయన ఆలోచనలు ప్రపంచం అంతట ఆరాధించారన్నారు.
అయితే కొంతమంది అరాచకులు భారతదేశంలో ఒక కులానికి చెందినవారు ఆయన చిన్న వృత్తంలో చిత్రీకరించాలని చూశారని, ఎందుకంటే ఆయన వారి మోసపూరిత కార్యాల్ని బయల్పరిచాడన్నారు. వారు ఆయనను ఆయన ఓ నాస్తికుడని, దేవుడిని నిరాకరించాడని, గ్రామాలకు వ్యతిరేకి అని ఆ విషయాన్ని మాత్రమే ప్రచారం చేశారన్నారు. పేరియర్ చేసిన ఆలోచనలు పూర్తిగా అర్థం చేసుకున్నవారు చాలా కొద్దిమందే అని చెప్పారు. పెరియరును పూర్తిగా తెలుసుకోవడం కోసం పదివేల పేజీలు చదవడం అందరికీ వీలు కాదని, ఈ రోజుల్లో ఎవరికి వివరించైనా ప్రజలు తెలుసుకో తలుచుకుంటే తక్కువ సమయంలో తెలుసుకోవాలని అనుకుంటారన్నారు. తమిళనాడు రాష్ట్రంలో పుట్టడం ఆ రాష్ట్రానికి ఎంతో విలువైన రాష్ట్రంగా పేరు తెచ్చిందని పేర్కొన్నారు. ఆసియా ఖండంలో బుద్ధుడు తొలి సాంఘిక సంస్కర్త అయిన, కులక్షతను దేవుని సంతృప్తి పరచడానికి ఇచ్చే జంతుబలులను వ్యతిరేకించారని తెలిపారు. ఆయన ఎప్పుడూ దేవుడికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడలేదని అయితే ఆయన మూఢనమ్మకాలను గుడ్డిగా ఆచారాలను పాటించడానికి వ్యతిరేకించాడన్నారు. వివేక్షితమైన వ్యతిరేకంగా మాట్లాడినందున అందరితో అన్ని భారతదేశంలో ప్రచారం గావించిన శంకర చార్య బుద్ధిజ్యాన్ని నిరసించారన్నారు. ప్రజలను గుడ్డిగా దేవుడు నమ్మేటట్టు చేశారని, వారిరువురు కలిసి వీరాభిమాని, దేవుడు సృష్టించారన్నారు. ప్రజలు అమాయకంగా నమ్మే విధంగా చేశారన్నారు. వాళ్ళు ఇరువురు కలిసి వేలాది మంది దేవుళ్లను సృష్టించారని, ప్రజలు అమాయకంగా ఈ మత వాక్యలకులు రాసిన పురాణాలను అందులోని కథలను నమ్ముతూ వారి స్వార్థాన్ని శాశ్వతంగా బలవుతున్నారన్నారు. రాజులు ఈ మత ఆరాధకులను మళ్లీ ప్రజల సొమ్ముతో ఎన్నో వారి దేవాలయాలు కట్టించారు ఒక రాజు కూడా ప్రజలను విజయవంతం చేయడం కోసం బడులు కట్టిన దాకాలు లేవు అన్నారు.
పెరియారుకు చిన్నతనం నుంచి ఎవరు ఏం చేసినా అదేమిటో ఎందుకో తెలుసుకోవాలనే తత్వం ప్రశ్నించే గుణం ఉండేదన్నారు. ఆయన కుల వివక్షను, స్త్రీలను అమానుషంగా చూడడాన్ని సహించేవాడు కాదన్నారు.
ఆయనకు స్త్రీలను వెధవలుగా మార్చడం చాలా కోపం తెప్పించేదని, ఆయన దేవుళ్ళ కోసం తీర్థయాత్రలు తినడానికి ప్రజలు రచించే సమయం సొమ్ము వృధా అని చెప్పేవాడన్నారు. తెలియదు ఆత్మగౌరవ సంస్థ ప్రారంభం చేశారని, కులాల సృష్టికి కారణం కనుక్కున్నాడన్నారు.
తమిళ భాషను ఆయన సంస్కరించారని, ఆయన కమ్యూనిజమును ఇష్టపడ్డారని చెప్పారు. పేరీయార్ ప్రసంగంలో తిరుగులేని ఉదాహరణలు ఇచ్చేవాడని,
ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయన మానసికంగా భౌతికంగా దృఢంగ ఉన్నాడని గుర్తు చేశారు. చాలా మంది వివిధ సంఘాల నాయకులు వారి ప్రసంగంలో క్లుప్తంగా చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతి రావు పూలే మాజీ అధ్యక్షులు సంధ్యల వెంకటేష్,
మానవ వికాస వేదిక జిల్లా అధ్యక్షులు భోగం రమేష్,
జిల్లా ప్రధాన కార్యదర్శి మానవ వికాస వేదిక కలకోటి వెంకటేష్, అల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాడ్గుల ఓదెలు, బీఎస్పీ వేల్పుల మల్లేష్, కొంకటి స్వామి మాజీ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ మానవ వికాస వేదిక, సాదుల రవీందర్ బాబు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్ మానవ వికాస వేదిక, చల్లూరి రాజు సోషల్ వర్కర్, ఇల్లందుల రమేష్ BSP, MD రఫి అడ్వాకెట్, కొలిపాక సారయ్య బిసి నాయకులు, దేవునూరి రవీందర్ MRPS నాయకులు, మీడిదొడ్డి రాజు మానవ వికాస వేదిక హుజురాబాద్, నిరంజన్ మానవ వికాస వేదిక
తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!