Social 1080×1350 • Multi-page
17-09-2024 BREAKING NEWS 12:50 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో రెండవ రోజు కొనసాగిన నిమజ్జన వేడుకలు..

హుజురాబాద్ లో రెండవ రోజు కొనసాగిన నిమజ్జన వేడుకలు..
IMG_20240917_234736

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పది రోజులపాటు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా పూజలు అందుకున్న భారీ వినాయకుల నిమజ్జన కార్యక్రమం మంగళవారం హుజూరాబాద్ లో భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలోని మూడవ వార్డ్ కుమ్మరి వాడ లోని శ్రీశాలివాహన యూత్, 20వ వార్డులోని సాయిబాబా గుడి పక్కన గల, 29వ వార్డులోని విద్యానగర్ కు చెందిన భారీ గణనాధుల నిమజ్జన వేడుకలు ఆయా భక్త మండల్ల ఆధ్వర్యంలో ప్రజలు, భక్తులు నిర్వహించారు. హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 120 వినాయక మండపాల్లో వినాయకులను నిన్న సాయంత్రం నుండి నేటి తెల్లవారు జాము వరకు ఆయా మంటప నిర్వాహకులు నిమజ్జనం చేసింది విధితమే. నేడు డబ్బు చప్పులతో నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకొని పట్టణ శివారులోని కాకతీయ కాలువలో అర్ధరాత్రి దాటాక నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ నిర్మల, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, మేనేజర్ భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా భారీ వినాయక నిమజ్జనంల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ బందోబస్తు నిర్వహించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!