18-09-2024 NORMAL NEWS 05:18 AM
swarnodayam.com
Telugu Daily News
18-09-2024 05:18 AM By Mandala Yadagiri

చలో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయండి

చలో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయండి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 20 తారీకున భవన నిర్మాణం వెల్ఫేర్ బోర్డు స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దని ప్రభుత్వమే బోర్డు ద్వారా సంక్షేమ పథకాలన కార్మికులకు అందించాలని తెలంగాణ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ కదిరే రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హుజురాబాద్ లేబర్ అడ్డా ప్రాంతంలో మాట్లాడుతూ తెలంగాణ భవనం మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద బీమా సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ఈ నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ ద్వారా అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతనుండి తప్పుకోవాలని నిర్ణయించుకుంటుందని ఆరోపించారు. వెల్ఫేర్ బోర్డులు అడ్వైజర్ కమిటీ నియమించాలని, నిధులను దారి మళ్లించకుండా కార్మికుల సంక్షేమ కోసమే ఖర్చు చేయాలన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరుతూ ఈనెల 20 తారీకున చలో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేయడం జరుగుతుందన్నారు. భవన నిర్మాణ కార్మికులంతా వేల్పూర్ బోర్డును రక్షణ కోసం ఐక్యంగా సంఘాలకు అతీతంగా పాల్గొనాలని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వలన కార్మికులకు వస్తున్న స్కీములు అందకుండా పోతాయన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి ఆధార్ కార్డులో తప్పులు రేషన్ కార్డు తప్పులు లేబర్ కార్డులో తప్పులు వెతికి కార్మికులకు నష్టపరిచే విధంగా చేస్తారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు అన్నారు. ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు నేరుగా అందించాలన్నారు. 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం వందల దెబ్బతిని భర్త కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు రక్షించాలన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీ కార్మిక సంఘల ప్రతినిధులతో నియమించాలని, బోర్డు నిధులు దుబారకాకుండా కార్మికుల సంక్షేమ కోసమే ఖర్చు చేయాలన్నారు. కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్ పిల్లలకు స్కాలర్షిప్ గృహవసతి అడ్డాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టులు రోడ్లు పెద్ద పెద్ద కంపెనీలకు ఇటుక బట్టీలు పనిచేసే కార్మికులకు వలస కార్మికులకు అందరికీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారపు శ్రీధర్, మైస శ్రీనివాస్, మైస పోచయ్య, పత్తిపాక రమేష్, వెంకటేశ్వర్లు, రవీందర్, మొగులయ్య, తిరుపతి, రవీందర్, వెంకటయ్య, ఎండి హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

—————–++++++———–

*పత్రికా ప్రకటనలు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!