Social 1080×1350 • Multi-page
18-09-2024 BREAKING NEWS 12:27 PM
swarnodayam.com
Telugu Daily News

తుమ్మేటి కుటుంబ సభ్యులకు టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం పరామర్శ

తుమ్మేటి కుటుంబ సభ్యులకు టీపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రి పొన్నం పరామర్శ
IMG-20240918-WA2467

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జమ్మికుంటలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కుటుంబాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు సందర్శించి పరామర్శించారు. ముందుగా తుమ్మేటి చిత్ర పటానికి వారు నివాళులు అర్పించారు. సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, cwc సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

————–+++++———————

*పత్రికా ప్రకటన*

———————-+-++—————

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!