Social 1080×1350 • Multi-page
19-09-2024 BREAKING NEWS 07:19 AM
swarnodayam.com
Telugu Daily News

అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు

అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు
IMG-20240919-WA1017

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. 13 రోజుల అనంత‌రం అంటే అక్టోబ‌ర్ 15వ తేదీన పాఠ‌శాల‌లు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబ‌ర్ 2 నుంచి బతుక‌మ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌ర్ 12వ తేదీన ద‌స‌రా పండుగను జ‌రుపుకోనున్నారు. డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను కూడా ప్రభుత్వం ప్రక‌టించింది. ఇక సంక్రాంతి సెల‌వులు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు ప్రక‌టించింది. సంక్రాంతి సెల‌వులు ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు. ముందస్తు సెలవులను ప్రకటించడంతో విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!