Social 1080×1350 • Multi-page
19-09-2024 BREAKING NEWS 10:46 AM
swarnodayam.com
Telugu Daily News

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం!

రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం!
1000596301

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రేష‌న్ కార్డుల జారీకి ప‌టిష్ట‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు 2వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సీఎం సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల‌పై ముఖ్య‌మంత్రి స‌చివాల‌యంలో ఉన్నతస్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇవ్వడానికి సంబంధించి క‌స‌ర‌త్తు చేశారు. ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.


*పత్రికా ప్రకటనలు*

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!