Social 1080×1350 • Multi-page
20-09-2024 BREAKING NEWS 06:20 AM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ కరాటే పోటీలలో మెరిసిన మేలిమి బంగారం. ఊకంటి సన్నిహిత.. అభినందించిన ఎస్సై రవి

జాతీయ కరాటే పోటీలలో మెరిసిన మేలిమి బంగారం. ఊకంటి సన్నిహిత.. అభినందించిన ఎస్సై రవి
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దమ్ముక కామ్ షటోరియో కరాటే వారి ఆధ్వర్యం
ఈ నెల 15 ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ కరాటే పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచి సిల్వర్ పథకం సాధించి తెలంగాణ కరాటే అసోసియేషన్ చైర్మన్ వసంత్ కుమార్ చేతుల మీదుగా అందుకున్న సంధర్భంగా గురువారం రోజున కేశపట్నం ఎస్సై రవి పతకం సాధించిన సన్నిహిత మెడలో సిల్వర్ పథకాన్ని వేసి శాలువాతో ఘనంగా
సన్మానించారు.

ఈ సందర్భంగా కేశపట్నం ఎస్సై రవి మాట్లాడుతూ…
నేటి సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపించలేని తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కేశపట్నం గ్రామం కాచపూర్ పరిధిలోని నివాసముంటున్న ఊకoటీ రవి మాత్రం తన బిడ్డ ఊకoటీ సన్నిహిత నిర్భయంగా గత నాలుగు సంవత్సరాల నుండి హుజురాబాద్ గ్లోబల్ షోటోకాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ మాస్టర్ జలీల్ వద్ద ప్రత్యేక కరాటే శిక్షణ ఇప్పించడం అభినందనీయం అని కొనియాడారు. సన్నిహిత జాతీయ కరాటే పోటీలలోనే కాకుండా అంతర్ జాతీయ పోటీలలో పతకాలు తెసుకువచ్చి దేశం గర్వ పడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా విద్యార్థినీ, విద్యార్థులు, యువతి యువకులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ తల్లిదడ్రులు ఎంతో నమ్మకంతో స్కూల్స్, కాలేజీలకు పంపుతున్నప్పటికి కొంత మంది పిల్లలు జల్సాలు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన స్పోర్ట్స్, గేమ్స్, కరాటే లాంటి నేర్చుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలలో పాల్గొని తమ తల్లదండ్రులకే కాకుండా ప్రాంతానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. అనంతరం కరాటే మాస్టర్ జలీల్ ఊకoటి సన్నిహిత తండ్రి ఊకoటీ రవిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ క్రీడాకారులు,
గ్లోబల్ షోటోకాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!