Social 1080×1350 • Multi-page
20-09-2024 BREAKING NEWS 06:56 AM
swarnodayam.com
Telugu Daily News

రెండవ విడత దళితబంధు నిధులు మంజూరు చేపించండి. -ప్రణవ్ ను కోరిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ సాధన సమితి సభ్యులు.

రెండవ విడత దళితబంధు నిధులు మంజూరు చేపించండి. -ప్రణవ్ ను కోరిన దళిత బంధు కాంగ్రెస్ పార్టీ సాధన సమితి సభ్యులు.
IMG-20240920-WA0281

–ప్రభుత్వ పెద్దలకు సమస్యను వివరిస్తా..ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేపించేందుకు కృషి చేయాలని దళితబంధు కాంగ్రెస్ పార్టీ సాధన సమితి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంన్చార్జ్ వొడితల ప్రణవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో మాకు ఆశ చూపెట్టి అకౌంట్లో డబ్బులు వేసినట్టే వేసి వాటిని ఉపయోగించకుండా చేశారని, రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి తమకు దళిత బంధు రెండో విడత ఇప్పించలేదని,రెండోవిడత రాక తాము ఇబ్బంది పడుతున్నామని కావున మాకు రెండోవిడత దళితబంధు వచ్చేలాగా సంబంధిత మంత్రులతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా కృషి చేయాలని ప్రణవ్ ను కోరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం అయ్యేలా చేస్తున్నానని, రెండో విడత దళితబంధు వచ్చేలాగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్, అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్, సుంకరి రమేష్, పుల్లూరు సదానందం, రాజ్ కుమార్, భద్రయ్య, రామస్వామి, సతీష్, అంకూస్, ఓంకార్, భిక్షపతి, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!