Social 1080×1350 • Multi-page
21-09-2024 BREAKING NEWS 07:17 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్వర్యంలో ఆర్డీవో, తహసిల్దార్ కు హుజురాబాద్ మండల కేంద్రంలో వినతిపత్రం.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్వర్యంలో ఆర్డీవో, తహసిల్దార్ కు హుజురాబాద్ మండల కేంద్రంలో వినతిపత్రం.
IMG_20240921_181423

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం పక్షాన ప్రభుత్వాన్నికి పలువురు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి తగిన విధంగా ఆదుకుంటామని ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనేక వర్గాలకు పెద్దపీట వేస్తుందని, అలాగే తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెన్షన్ అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అద్యక్షులు కనకం కుమారస్వామి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ఎక్కటి సంజీవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ ZPTC సరోజనా ప్రభాకర్, ఊకంటి మల్లాచారి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు K.U JAC వ్యవస్థాపక సభ్యుడు జవ్వాజి కుమార్(జే.కె), అన్నం ప్రవీణ్, దబ్బట రాజు, మల్లేష్, కంది దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!