Social 1080×1350 • Multi-page
21-09-2024 BREAKING NEWS 08:35 AM
swarnodayam.com
Telugu Daily News

మున్సిపల్ సర్వసభ్య సమావేశం బహిష్కరించిన పాలకవర్గం

మున్సిపల్ సర్వసభ్య సమావేశం బహిష్కరించిన పాలకవర్గం
IMG-20240921-WA0075

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం అధికారులు రాలేదన్న కారణంతో కౌన్సిలర్లు బహిష్కరించి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. గత కొన్ని సమావేశాల నుండి మున్సిపల్ అధికారులలో కొందరు సమావేశానికి హాజరు కావడం లేదని దీనివల్ల పరిపాలన ఇబ్బంది అవుతుందని వారన్నారు. సమావేశానికి అందరూ అధికారులు హాజరైనప్పుడే వస్తామని కౌన్సిలర్లు అన్నట్లు తెలిసింది. దీంతో సర్వసభ్య సమావేశం మరోసారి అధికారులందరూ హాజరయ్యేలా చూసి సమావేశం నిర్వహిస్తామని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. వివిధ కారణాలతో ప్రజాప్రతినిధులు జనరల్ బాడీ సమావేశాన్ని బహిష్కరించడం తెలిసిందే కానీ అధికారుల గైర్హాజర్ ను నిరసిస్తూ సభను బహిష్కరించడం చర్చనీయాంశముగా మారింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!