Social 1080×1350 • Multi-page
22-09-2024 BREAKING NEWS 01:53 AM
swarnodayam.com
Telugu Daily News

జాతీయస్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు

జాతీయస్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు
IMG_20240922_124910

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్లోబల్ షోటో ఖాన్ కరాటే డో ఇండియా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు దమ్ముక కామ్ సెటోరియా కరాటే వారి ఆధ్వర్యంలో ఈ నెల 15న కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ కరాటే పోటీలలో హుజురాబాద్ కరాటే విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచినట్లు కరాటే మాస్టర్ జలీల్ తెలిపారు. వివిధ స్థాయిలలో విద్యార్థులు గెలుపొందడం జరిగిందని, ఈ సందర్భంగా హుజురాబాద్ లోని న్యూ కాకతీయ హై స్కూలులో ఈరోజు ఆదివారం ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పలువురు పాల్గొన్నారన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులైన చిన్నారులను విద్యతో పాటు కరాటేతో శారీరకంగా మానసికంగా ఉన్నతులుగా తయారు చేయడము జరుగుతుందన్నారు. అంతే కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతోపాటు రేపటి సమాజానికి కావలసిన ఉత్తమ భావిభారత పౌరులుగా ఎదగడానికి తోడ్పడుతుందని అని అన్నారు. కరాటే ముఖ్యంగా నేటి సమాజంలో ఆడపిల్లలు తమను తాము ఏ సమయంలో నైనా రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ స్థాయిలో బహుమతులు పొందడానికి మార్గదర్శకులుగా నిలుస్తున్న కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ని మరియు విద్యార్థులను అభినందించారు. అనంతరము బహుమతులు పొందిన విద్యార్థులను మెడల్స్ మరియు శాలువాలతో కార్యక్రమంలో పాల్గొన్న గ్లోబల్ షో టో కాన్ కరాటే డు ఇండియా గౌరవాధ్యక్షులు అంబాల ప్రభాకర్, రెండవ వార్డ్ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరి నాయక్, కాంగ్రెస్ పట్టణ సీనియర్ నేత కాజీపేట శ్రీనివాస్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ఖలీద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే కమిటీ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్ పటేల్, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ లీడర్ మొహమ్మద్ ఆలీమ్, బీసీ జెఏసి జిల్లా కరీంనగర్ ఎర్రబొజ్జు నారాయణ, మహమ్మద్ సలీం తదితరులు వారిని ఘనంగా సత్కరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!