Social 1080×1350 • Multi-page
22-09-2024 BREAKING NEWS 07:46 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ

హుజురాబాద్ పట్టణంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ
IMG-20240820-WA1002

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు కం సెలక్షన్స్ హుజురాబాద్ లోని గవర్నమెంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని హుజూరాబాద్ ఎంఈఓ కే శ్రీనివాస్ రెడ్డి టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సొల్లు సారయ్యలు తెలిపారు. ఇందులో పాల్గొనేటువంటి మండల కబడ్డీ జట్లు ప్రారంభ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలన్నారు. ప్రతి టీం కూడా వారి వారి మండల ఫ్లాగ్ తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకు హుజురాబాద్ గ్రౌండ్లో హాజరు కావాలనీ కోరారు. 23 న అండర్ 17 కబడ్డీ బాల బాలికలకు, 24న అండర్ 14 కబడ్డీ బాల బాలికలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరు కూడా వారి వారి ఎలిజిబులిటీ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్ జతచేస్తూ తప్పకుండా పాల్గొనాలని వారు కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!