Social 1080×1350 • Multi-page
22-09-2024 BREAKING NEWS 10:05 AM
swarnodayam.com
Telugu Daily News

ఇంటింటా భగవద్గీత గ్రంథాల ప్రచారం

ఇంటింటా భగవద్గీత గ్రంథాల ప్రచారం
IMG-20240922-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ సెప్టెంబర్ 22: హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో త్రైత సిద్ధాంతం ప్రబోధా సేవ సమితి ఇందు జ్ఞాన వేదిక హుజురాబాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇంటింటా త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం చేశారు. భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అధ్యాయం నందు 16వ శ్లోకంలో క్షర పురుషుడు అని జీవాత్మ గురించి అక్షర పురుషుడు అని ఆత్మ గురించి 17వ శ్లోకంలో పురుషోత్తముడు అని పరమాత్మ గురించి చెప్పారన్నారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనే మూడు ఆత్మలు ఆధ్యాత్మికములో ముఖ్యమైనవి అని అర్థం అని, దీని ఆధారంగానే త్రైత సిద్ధాంత భగవద్గీతను గురువుగారు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామి వారు రాశారన్నారు. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసి శాస్త్ర బద్దతతో కూడిన జ్ఞానoను అందించారన్నారు. మధ్యాత్మ ఆరాధనతో ధర్మముల స్థాపన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవ సమితి హుజురాబాద్ కమిటీ అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి, సభ్యులు సతీష్ చారి, గోపికృష్ణ, తిరుపతి, రాంబాబు, నరేష్, రామస్వామి, రాహుల్, కుమారస్వామి, రమేష్ కెఎంపి, సిద్ధార్థ, జ్యోతి, చంద్రమ్మ, సరిత, దివ్య, ప్రియాంక, అద్వితీయ, పద్మ శకుంతల దైవ జ్ఞాన ప్రచారంలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!